Temple Priest Murder Case: గుడిలో పూజారి హత్య కేసు మిస్టరీ వీడింది, ఆస్తి తగాదాలతో తమ్ముడి కొడుకే దారుణంగా చంపేశాడు, అయిదు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆస్తి తగాదాల నేపథ్యంలో కొత్తలంక వీరవెంకట సుబ్రహ్మణ్య సుమంత్.. మరో నలుగురితో కలిసి నాగేశ్వర శర్మను చంపినట్టు తేల్చారు.

Temple Priest Murder Case: గుడిలో పూజారి హత్య కేసు మిస్టరీ వీడింది, ఆస్తి తగాదాలతో తమ్ముడి కొడుకే దారుణంగా చంపేశాడు, అయిదు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
West Godavari Police Reveals Temple priest murder Case Details, Five Accused Arrested

Amaravati, May 26: పశ్చిమగోదావరి జిల్లాలో గుడిలో పూజారి దారుణ హత్య కేసును ఏపీ పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామ శివారులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కొత్తలంక వెంకటనాగేశ్వరశర్మ అనే పూజారిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛేదించిన నిడదవోలు పోలీసులు.. పూజారి తమ్ముడి కుమారుడే హత్య చేసినట్టు నిర్ధారించారు.  ఏపీలో దారుణం, శివాలయం లోపల పూజారి దారుణ హత్య, తల పగుల గొట్టి ఆయన్ను దారుణంగా హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు

ఆస్తి తగాదాల నేపథ్యంలో కొత్తలంక వీరవెంకట సుబ్రహ్మణ్య సుమంత్.. మరో నలుగురితో కలిసి నాగేశ్వర శర్మను చంపినట్టు తేల్చారు. నిందితులు సుమంత్ సహా కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన హనుమంతరావు, ఆలపాటి రాఘవ, తూర్పుగోదావరి జిల్లా ఎల్చేరుకు చెందిన సురేశ్, విజ్యేశ్వరానికి చెందిన షేక్ పీర్ మజీన్ లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ మీడియా ముందుకు వారిని తీసుకొచ్చారు.

(The above story first appeared on LatestLY on Mar 26, 2022 05:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).