Andhra Pradesh: నీకు పెళ్లయినా నన్నే ప్రేమించాలంటూ యువతికి వేధింపులు, కాదనడంతో ఆమె ఇంట్లోనే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను.. పెళ్లయిన యువతి ప్రేమించలేదని గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి (Young Man attempt suicide) పాల్పడ్డాడు.
Anantapur, August 20: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను.. పెళ్లయిన యువతి ప్రేమించలేదని గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి (Young Man attempt suicide) పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం (Anantapur) రూరల్ పరిధిలోని ఎల్‌బీ నగర్‌కు చెందిన గోపాల్‌నాయక్ కుమారుడు బాలాజీ నాయక్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. అతని చిన్ననాటి స్నేహితురాలు పాపంపేటలో ఉంటోంది. ఆమెకు నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. కానీ, బాలాజీ నాయక్ ప్రేమ పేరుతో ఆమెను వేధించేవాడు. విసిగిపోయిన ఆమె రెండు నెలల నుంచి మాట్లాడడం (Married woman Refuse His love) మానేసింది.
అయినా పెళ్లయినా ఫర్వాలేదు. కానీ నన్ను ప్రేమించాలి. చిన్ననాటి నుంచి నిన్నే ప్రేమిస్తున్నా. నువ్వు నాతో మాట్లాడడం మానేస్తే ఎలా? ప్రేమించకపోతే కత్తితో గొంతు కోసుకుంటా’ అని ఓ వివాహితను బెదిరిస్తూ వస్తున్నాడు. బాలాజీనాయక్ శుక్రవారం పాపంపేట చేరుకుని ఆమె స్నేహితురాలి భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లగానే లోపలికి వెళ్లి తనను ప్రేమించాలని మరోసారి వేధించాడు. తనకు వివాహమైందని, వేధించడం మానుకోవాలని చెప్పినా వినలేదు.
చాక్లెట్లు ఆశ చూపి.. ఆరేండ్ల చిన్నారిపై హాస్యనటుడి లైంగిక వేధింపులు.. ఎక్కడ?
చివరకు అదే ఇంట్లోని కత్తి తీసుకుని గొంతు కోసుకున్నాడు. భయాందోళనకు గురైన ఆమె విషయాన్ని బాలాజీ నాయక్ సోదరులు ఎం.రవీంద్ర నాయక్, మని నాయక్‌కు తెలియజేసింది. వారు వెళ్లి చూడగా బాలాజీ నాయక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Aug 20, 2022 09:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

