Andhra Pradesh: పెళ్లయిన యువతితో ప్రేమాయణం, యువతి వ్యతిరేకించడంతో తప్పతాగి వాళ్లింటి పనిమనిషిని కత్తితో నరికేసిన యువకుడు, అడ్డు వచ్చిన తల్లిపై దాడి
అమలాపురంలో ఓ యువతిని సైకో హత్య చేసిన ఘటనలో పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. స్నాప్ చాట్ యాప్ ద్వారా ప్రేమించిన యువతిని హత్య చేయబోయి మరొక యువతిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
VJY, April 6: అమలాపురంలో ఓ యువతిని సైకో హత్య చేసిన ఘటనలో పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. స్నాప్ చాట్ యాప్ ద్వారా ప్రేమించిన యువతిని హత్య చేయబోయి మరొక యువతిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఘటన వివరాల్లోకెళితే.. అమలాపురం ఏఎంజీ కాలనీ యువతితో ఐదు నెలల క్రితం స్నాప్ చాట్ యాప్ ద్వారా నెల్లూరుకు చెందిన కోట హరికృష్ణకు పరిచయమైంది.
ఆమెకు వివాహమైందని తెలిసి కూడా ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు దిగాడు. దీంతో హరికృష్ణతో మాట్లాడడం మానేసింది. అలాగే మెసేజ్‌లకు స్పందించడం మానేసింది. దీంతో హరికృష్ణ.. సైకోలా మారిపోయాడు. దీంతో ఆగ్రహించిన హరికృష్ణ ఆమెను హత్య చేసేందుకు అమలాపురం పట్టణానికి వచ్చాడు.ఓ బార్‌లో మద్యం తాగి యువతిని అంతం చేయాలని స్కెచ్ గీశాడు. చాటింగ్ సమయంలో మహిళ తన నివాస చిరునామాను అతనితో పంచుకోవడంతో, అతను మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు.
యువతి ఇంటికి వెళ్లి ఆమె అనుకుని అక్కడున్న పనిమనిషి మన్నే శ్రీదేవి(28)ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇది చూసిన యువతి తల్లిపై కూడా హత్యాయత్నం చేశాడు. ఆమె ఎలాగో తప్పించుకుంది. ఘటనలో శ్రీదేవి అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి వెంకటరమణ గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. మహిళల కేకలు విన్న ఇరుగుపొరుగు వారు హరికృష్ణను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
(The above story first appeared on LatestLY on Apr 06, 2023 01:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

