YSR Rythu Bharosa EKYC: అక్టోబర్ 12 లోపు వైఎస్సార్ రైతు భరోసా ఈ–కేవైసీ చేయించుకోవాలి, ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో రైతుల జాబితా
ఏపీలో పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Amaravati, Oct 4: ఏపీలో పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక తనిఖీల కోసం ఈ–కేవైసీ చేయించుకున్న రైతుల జాబితాలను ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖరీఫ్ సీజన్‌లో 1.08 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వీఆర్‌వో కలిపి 90 శాతం ఈ–క్రాప్‌ను ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. రైతులందరికీ తమ మొబైల్ నంబర్‌కు వారు సాగు చేసిన పంట, విస్తీర్ణం, ఇతర వివరాలను మెసేజ్ రూపంలో పంపుతున్నామని వివరించారు. ఈ వివరాలను తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే సిబ్బంది సంతకంతో కూడిన రశీదు కూడా ఇస్తారని తెలిపారు.
(The above story first appeared on LatestLY on Oct 04, 2022 12:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

