
Amaravati, Oct 3: గత కొద్దిరోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో, ఏపీ నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
దీంతో పాటుగా రానున్న మూడు రోజల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని (Weather Forecast) వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains for the next Three days) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.