Gudivada Amarnath on Chandrababu Govt: 30 రోజుల పాలనలోనే ఇంత మోసమా, చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత గుడివాడ అమరనాథ్
ఎన్నికల ముందు చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15000 చొప్పున ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 29లో పిల్లలను బడికి పంపే తల్లికి రూ.15000 వేలు ఇస్తామని చెప్పారు. దీనిపై తల్లుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు దీనిపై ఎందుకు ప్రకటన చేయలేదు.. ఉచిత ఇసుక అని చెప్పి అమ్ముకుంటున్నారు. అప్పుల మీద ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు.
Vjy, July 12: చంద్రబాబు 30 రోజుల పాలనపై మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికే పరిమితమై పరిపాలన కొనసాగించారని దుయ్యబట్టారు. నాలుగు సార్లు సీఎం ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమి చెయ్యకుండా ఇప్పుడు చవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి కావాల్సిన అనుమతులు అన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడితే ఇప్పుడు వచ్చి చంద్రబాబే అన్ని తానే చేసినట్లు మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఏమి చెయ్యకుండా అన్ని తనే చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకి ఆయనే సాటి.. దేశంలో చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ దేశంలో ఎవరికి వుండవంటూ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు దోచుకోవడానికే ఉచిత ఇసుక పాలసీ, కూటమి ప్రభుత్వంపై మండిపడిన పేర్నినాని
గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు ఎప్పుడైనా పోర్ట్‌లు, మెడికల్ కాలేజీలు కట్టించారా?. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే ఇప్పుడేమో జగన్ ఏమి చెయ్యలేదని చంద్రబాబు చిత్రీకరించారు. మేము మొదలు పెట్టిన పనులు చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి తల్లికి వందనం 15000 ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడేమో ఒకరికే ఇస్తాం అన్నట్లు జీఓ ఇచ్చారు.. ఇసుక ఫ్రీ అన్నారు, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు... వాలంటీర్లు పరిస్థితి ఏంటో చెప్పాలి అంటూ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి 30 రోజులు అయ్యింది. అప్పుడే ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టేశారు.. గడిచిన నెల రోజుల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మీద దాడులు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై కూడా దాడుకు దిగడం చాలా దారుణం‘‘ అంటూ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు.
(The above story first appeared on LatestLY on Jul 12, 2024 05:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

