Andhra Shocker: క‌ట్ట‌ల కొద్దీ డ‌బ్బు చెదలపాలు, లబోదిబోమంటున్న బాధితుడు, మైలవరంలో మాసం దుకాణం యజమాని ట్రంకు పెట్టెలో దాచిన రూ. 5 లక్షల డబ్బును తినేసిన చెదలు

ల్లు కట్టుకుందామని పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము చెదలపాలైంది. అది చూసి తట్టుకోలేని ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా మైలవరంలో జరిగింది.

Andhra Shocker: క‌ట్ట‌ల కొద్దీ డ‌బ్బు చెదలపాలు, లబోదిబోమంటున్న బాధితుడు, మైలవరంలో మాసం దుకాణం యజమాని ట్రంకు పెట్టెలో దాచిన రూ. 5 లక్షల డబ్బును తినేసిన చెదలు
INR currency (Photo Credits: Pixabay)

Amaravati, Feb 17: ఇల్లు కట్టుకుందామని పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము చెదలపాలైంది. అది చూసి తట్టుకోలేని ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా మైలవరంలో జరిగింది. మైలవరానికి (Mylavaram) చెందిన జమలయ్య స్థానిక విజయవాడ రోడ్డులోని వాటర్ ట్యాంకు వద్ద మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న రేకుల ఇల్లు చిన్నగా ఉండడంతో దానిని పెద్దగా కట్టుకోవాలని భావించిన జమలయ్య అందుకోసం రూ. 10 లక్షలు పోగేయాలని నిర్ణయించుకున్నాడు. డబ్బులు దాచుకునేందుకు బ్యాంకు కంటే త‌న ఇంట్లోని ట్రంకు పెట్టే సేఫ్ అనుకున్నాడు. తాను క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్మును ఆ పెట్టెలో పెట్టాడు.

క‌ట్ట‌ల కొద్దీ డ‌బ్బు..మొత్తం రూ.500, 200, 100 నోట్ల క‌ట్ట‌లు. కానీ ఆ డ‌బ్బు కాస్తా చివ‌రికి చెద‌ల (Termites) పాల‌యింది. ఏకంగా రూ.5 ల‌క్ష‌లను చెదలు తినేశాయి. పందుల వ్యాపారం చేసే అత‌డు.. న‌గ‌దు రూపంలోనే వ్యాపారం చేస్తాడు. ఇందులో వ‌చ్చే డ‌బ్బు మొత్తాన్నీ బ్యాంకులో వేసే బ‌దులు ఇంట్లోని ట్రంకు పెట్టెలోనే పెట్టేవాడు. అలా ఇప్పటి వరకు దాదాపు రూ. 5 లక్షలు (Lifetime Savings of Rs 5 Lakh) పోగేశాడు. తాజాగా, ఓ లక్ష రూపాయలు అవసరం ఉండడంతో పెట్టెను తెరవగా అందులోని దృశ్యం చూసి హతాశుడయ్యాడు.

మహిళపై దారుణం, మూడు కిలోమీటర్లు వ్యక్తిని మోసుకుంటూ వెళ్లాలని హుకుం జారీ చేసిన గ్రామస్తులు, మధ్యప్రదేశ్‌లో ఆటవిక చర్య, కేసు నమోదు చేసిన పోలీసులు

నోట్లన్నీ చెదలుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కష్టపడి దాచుకున్న డబ్బు చెదలపాలు కావడంతో గుండెలవిసేలా రోదిస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు జమలయ్య ఇంటికొచ్చి ఆరా తీశారు. ఆ మిగిలిన క‌రెన్సీ ముక్క‌ల‌ను చుట్టుప‌క్క‌ల ఉండే పిల్ల‌ల‌కు పంచి పెట్ట‌డం విశేషం. పిల్లల చేతుల్లో పెద్ద పెద్ద నోట్లు క‌నిపించే స‌రికి పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఇది తన కష్టార్జితమని ఎందుకు పనికిరాకుండా పోయిందని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు.

(The above story first appeared on LatestLY on Feb 17, 2021 03:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).