Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. అధికారుల ప్రయత్నాలకు ఎట్టకేలకు దక్కిన ఫలితం.. ఇప్పటివరకూ నాలుగు చిరుతలను బంధించామన్న అధికారులు

తిరుమలలో చిరుతలను పట్టుకునేందుకు అధికారుల చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అధికారులు తాజాగా తెలిపారు.

Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. అధికారుల ప్రయత్నాలకు ఎట్టకేలకు దక్కిన ఫలితం.. ఇప్పటివరకూ నాలుగు చిరుతలను బంధించామన్న అధికారులు
Cheetah. Representational Image. (Photo credits: Twitter/ANI)

Tirumala, Aug 28: తిరుమలలో (Tirumala) చిరుతలను (Leopard) పట్టుకునేందుకు అధికారుల చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి (Alipiri) కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అధికారులు తాజాగా తెలిపారు. ఈ చిరుతను బంధించేందుకు అధికారులు కొన్ని రోజులుగా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత పలుమార్లు బోను వరకూ వచ్చి వెళ్లినట్టు కూడా సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది.

ఇప్పటివరకూ మొత్తం నాలుగు చిరుతలు

ఆదివారం రాత్రి ఎట్టకేలకు ఈ చిరుత బోనులో చిక్కింది. ఇప్పటివరకూ మొత్తం నాలుగు చిరుతలు పట్టుబడ్డాయని అధికారులు తెలిపారు. కాగా అలిపిరి కాలి నడక మార్గంలో ఇటీవల ఓ చిరుత ఓ బాలికను చంపుకుతినడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

(The above story first appeared on LatestLY on Aug 28, 2023 08:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).