Statue Of Social Justice: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, సామాజిక న్యాయ మహా శిల్పమంటూ అభివర్ణించిన సీఎం వైయస్ జగన్, విగ్రహ ప్రత్యేకతలివే!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Statue Of Social Justice) విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా (Statue Of Social Justice) అభివర్ణించింది రాష్ట్ర ప్రభుత్వం.
Vijayawada, JAN 19: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Statue Of Social Justice) విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా (Statue Of Social Justice) అభివర్ణించింది రాష్ట్ర ప్రభుత్వం. పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. పూర్తిగా మేడిన్ ఇండియా సామాగ్రితో పనులను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ డిజైన్లు రూపొందించింది.
విజయవాడ స్వరాజ్ మైదాన్ లో డా॥ బి.ఆర్. అంబేద్కర్ గారి 206 అడుగుల కాంస్య విగ్రహా అవిష్కరణ చేసిన సీఎం జగన్ గారు 👏🏻🙏🏻#StatueOfSocialJustice #JaganannaForSocialJustice #CMYSJagan #AndhraPradesh pic.twitter.com/zbXegzlTpL
— Dimple9119 (@Dimple_2016) January 19, 2024
అంబేడ్కర్ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు.
https://t.co/njkHfmHtOt pic.twitter.com/XBdDdrg1KL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 19, 2024
ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్ ఏర్పాటుచేశారు. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదే«శంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఉంటాయి. ఇక సెకండ్ ఫ్లోర్‌లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా జరుగుతున్న సామాజిక సమతా సంకల్ప సభకు హాజరైన ప్రజలు.#Ambedkar#Vijayawada#StatueOfSocialJustice#DrBRAmbedkarstatue#jaibhim pic.twitter.com/BNV7R4yirI
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 19, 2024
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్) మ్యూజియంను 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం. మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడి ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర పీఠం (పెడస్టల్)ను రూపొందించారు. విగ్రహ పీఠం లోపల జి ప్లస్ 2 అంతస్తులను ఐసోసెల్స్ ట్రాపేజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్ నిర్మాణం చేశారు. రాజస్థాన్‌కు చెందిన పింక్ రాక్‌ను ఉపయోగించారు.
(The above story first appeared on LatestLY on Jan 19, 2024 07:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

