Andhra Pradesh: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, బహ్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న వారిని వెంటనే వెనక్కు తీసుకురావాలని లేఖలో వినతి
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ (AP CM YS Jagan writes letter) రాశారు. బహ్రెయిన్‌లో ఓ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం చేతిలో చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది ఏపీకి చెందిన వారు ఉన్నారన్నారు.
Amaravati, Sep 13: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ (AP CM YS Jagan writes letter) రాశారు. బహ్రెయిన్‌లో ఓ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం చేతిలో చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది ఏపీకి చెందిన వారు ఉన్నారన్నారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం తెలిపారు.
నేడు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్ష జరుపుతున్నారు. ఈ సమావేశానికి మంత్రి గౌతమ్‌రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ సలహాదారు మధుసూదన్‌రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్‌రెడ్డి హాజరయ్యారు.
(The above story first appeared on LatestLY on Sep 13, 2021 03:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

