AP DSC Notification 2026: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2,721 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు, దరఖాస్తు తేదీల పూర్తి వివరాలు..
మొత్తం 2,721 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఉద్దేశించిన డీఎస్సీ-2026 (APTRT-2026)కి సంబంధించి పాఠశాల విద్యాల శాఖ మంగళవారం సంక్షిప్త (షార్ట్) నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది.
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం గత కొంతకాలంగా వేయికళ్లతో ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మొత్తం 2,721 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఉద్దేశించిన డీఎస్సీ-2026 (APTRT-2026)కి సంబంధించి పాఠశాల విద్యాల శాఖ మంగళవారం సంక్షిప్త (షార్ట్) నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వ ప్రకటించిన ముందస్తు ప్రణాళికకు అనుగుణంగా, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ భర్తీ ప్రకటన వెలువడటంతో ఆశావహుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ.. ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. దసరాకు ముందే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ..?
ఈ నూతన నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ , మున్సిపల్ సాధారణ పాఠశాలల విభాగంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), స్కూల్ అసిస్టెంట్ (SA) కేటగిరీలలో మొత్తం 2,111 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 1,205 ఎస్జీటీ పోస్టులు, 906 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ప్రత్యేక విద్య (స్పెషల్ ఎడ్యుకేషన్) విభాగంలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీల కింద మరో 350 పోస్టులను కేటాయించారు. అలాగే సంక్షేమ సొసైటీలు, గురుకుల నిర్వహణల కింద ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ కేటగిరీలలో మరో 260 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
జిల్లా వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 389 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 266 పోస్టులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 206 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియను ఆధునిక పద్ధతిలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా పారదర్శకంగా నిర్వహించనున్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్, రోస్టర్ల వారీగా ఖాళీలు, అర్హతలు, వయోపరిమితి సడలింపులు , ఆన్లైన్ దరఖాస్తుల తుది గడువులతో కూడిన సమగ్ర మార్గదర్శకాలను త్వరలోనే అధికారిక పోర్టల్లో అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.
ఈ లోపే అభ్యర్థులు పరీక్షలకు ముందస్తుగా సిద్ధమయ్యేందుకు వీలుగా ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో సిలబస్ను ముందస్తుగానే అందుబాటులో ఉంచారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు పడటంతో రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులు సన్నాహకాల్లో మునిగిపోయారు.
(The above story first appeared on LatestLY on Oct 14, 2026 09:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

