AP government banned phones in schools across the state

Vjy, August 28: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధిస్తూ కీలక ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలలకు విద్యార్థులు ఫోన్లను తీసుకురాకుండా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తమ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకురాకూడదని ఆదేశించింది.

తరగతి గదులకు వెళ్లే ముందు ఉపాధ్యాయులు తన ఫోన్లను ప్రధానోపాధ్యాయుడికి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. బోధనకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు, అందుకే దత్త పుత్రుడుకి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు, జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్

నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు చూడాలని ఆదేశించింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పై అధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది.