Chandrababu Bail Row: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు జగన్ సర్కారు, అత్యున్నత న్యాయస్థానం నిర్ధేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని వెల్లడి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబుకి హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కంటి శస్త్ర చికిత్స నిమిత్తం మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను పూర్తిస్థాయి బెయిల్‌గా మారుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

Chandrababu Bail Row: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు జగన్ సర్కారు, అత్యున్నత న్యాయస్థానం నిర్ధేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని వెల్లడి
chandrababu (Photo-PTI)

Vjy, Nov 21: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబుకి హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కంటి శస్త్ర చికిత్స నిమిత్తం మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను పూర్తిస్థాయి బెయిల్‌గా మారుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. తాత్కాలిక బెయిల్‌ సందర్భంగా జారీచేసిన బెయిల్‌ బాండ్‌ ఆధారంగా చంద్రబాబును విడుదల చేయాలని ఆదేశించింది. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడంగానీ చేయరాదంటూ అప్పట్లో విధించిన షరతులను హైకోర్టు సడలించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

 స్కిల్‌ కేసులో చంద్రబాబుకు ఊరట, రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు ఎలా సాగాయంటే..

బెయిల్‌ విషయంలో సుప్రీంకోర్టు నిర్ధేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని, పరిధి దాటినట్లనిపిస్తోందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి తీర్పునివ్వడం ద్వారా కింది కోర్టు అధికారాల్లో హైకోర్టులో జోక్యం చేసుకున్నట్లయింది. వాస్తవానికి బెయిల్‌ కేసుల్లో కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లకూడదు. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగే సమయంలో చంద్రబాబు న్యాయవాదులు తమ వాదనలను వినిపించలేదు. దీనిపై సీఐడీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ అభ్యంతరాన్ని హైకోర్టు రికార్డ్‌ కూడా చేసింది. ఈ బెయిల్‌ పిటిషన్‌ విషయంలో హైకోర్టు తీరు అసాధారణం. ఆరోపణలు, దర్యాప్తుపై కింది కోర్టు చేయాల్సిన పూర్తిస్థాయి ట్రయిల్‌ను హైకోర్టు నిర్వహించినట్లయిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

(The above story first appeared on LatestLY on Nov 21, 2023 03:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).