AP Inter Supplementary Exams 2022: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు అలర్ట్, ఆగస్టు 3 నుంచి 12 వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, విడుదలైన ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లి కార్యాలయంలో ఏపీ ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్‌ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు జూన్‌25 నుంచి జులై 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు.

AP Inter Supplementary Exams 2022: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు అలర్ట్, ఆగస్టు 3 నుంచి 12 వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, విడుదలైన ఫలితాల్లో బాలికలదే పైచేయి
Representational Image (Photo Credits: PTI)

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లి కార్యాలయంలో ఏపీ ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్‌ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు జూన్‌25 నుంచి జులై 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు.ఫెయిలైన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు (AP Inter Supplementary Exams 2022) ఆగస్టు 3 నుంచి 12 వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తామని వివరించారు.

ప్రకటించిన ఇంట‌ర్మీడియ‌ట్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సర ప‌రీక్షల ఫ‌లితాల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా విద్యార్థులు 72శాతం మంది ఉత్తీర్ణత సాధించగా కడప జిల్లా విద్యార్థులు అత్యల్పంగా 50శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మొత్తం 8లక్షల 69వేల 059 మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4లక్షల 45వేల 604 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 4లక్షల 23వేల 458 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని వివరించారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, bie.ap.gov.in, examresults.ap.nic.in ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

ఒకేషనల్‌ కోర్సులో 72వేల 299 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. మొదటి సంవత్సరంలో 2లక్షల 41వేల 591 మంది ఉత్ణీర్ణుల య్యారని వివరించారు. ఉత్తీర్ణత 54శాతం కాగా రెండవ సంవత్సరంలో 2లక్షల 58వేల 449 మంది పాసయ్యారని తెలిపారు. 61శాతం మంది పాసయ్యారని వివరించారు. మొదటి సంవత్సరంలో బాలురు 49శాతం, బాలికలు 60శాతం, రెండో సంవత్సరంలో 54శాతం బాలురు, బాలికలు 68శాతం పాసయ్యారని మంత్రి వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Jun 22, 2022 06:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).