Manabadi Inter Results 2022: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు (AP Inter Results 2022) విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల (Manabadi Inter Results 2022) చేశారు. రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశామని మంత్రి తెలిపారు. పరీక్షా ఫలితాల్లో ఫస్టియర్ లలో 241,591 మంది విద్యార్థులు పాస్ కాగా, సెకండ్ ఇయర్ లో 2,58,449 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫస్టియర్ లో 54 శాతం, సెకండ్ ఇయర్ లో 61 శాతం ఉతీర్ణత సాధించారని మంత్రి బొత్స్ తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 5 వరకు రీకౌంటింగ్ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. మే 24వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో పూర్తిచేసింది. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు, దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు నిరీక్షణ
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు.