Vangalapudi Anitha On Pawan Kalyan: ఏపీలో బాలికపై దారుణం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు స్పందించిన హోంమంత్రి అనిత, బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌కు స్పందించారు హోంమంత్రి అనిత. నెల్లూరు వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీలో ఓ మైనర్ బాలిక (13)ను 45 ఏళ్ల మహిళపై అలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి, బెదిరించాడంటూ జనసేన వీర మహిళ విభాగం ట్వీట్ చేసింది.
Hyd, Nov 9: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌కు స్పందించారు హోంమంత్రి అనిత. నెల్లూరు వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీలో ఓ మైనర్ బాలిక (13)ను 45 ఏళ్ల మహిళపై అలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి, బెదిరించాడంటూ జనసేన వీర మహిళ విభాగం ట్వీట్ చేసింది.
దీనిని రీ ట్వీట్ చేస్తూ ప్రశ్నించారు పవన్. నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. నేరాలపై అందరూ భయపడకుండా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎక్స్ వేదికగా కోరారు.
పవన్ చేసిన ట్వీట్‌పై స్పందించారు హోంమంత్రి అనిత. పవన్ కల్యాణ్‌తో పాటు హోంమంత్రిగా నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను అని ఎక్స్ వేదికగా తెలిపారు. నెల్లూరులో జరిగిన దారుణ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నామని.... నెల్లూరు ఎస్పీతో నేరుగా మాట్లాడాను.. విచారణ జరుగుతోందని తెలిపారు.
Here's Tweet:
As the Home Minister, I want to assure @pawankalyan garu and the people that the heinous incident in Nellore is being taken with utmost seriousness. I have contacted the SP of Nellore @sp_nlr(police department) directly, and a thorough investigation is underway. We are committed… https://t.co/D6lCBfXLlN
— Anitha Vangalapudi (@Anitha_TDP) November 9, 2024
ఇలాంటి దారుణమైన చర్యలను సహించేది లేదు అన్నారు. ప్రజల భద్రత, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెప్పారు.
(The above story first appeared on LatestLY on Nov 09, 2024 02:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

