AP MLC Election Result: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలు వీరే, ఆరు సీట్లను గెలుచుకున్న వైసీపీ, రెబల్స్ సాయంతో ఓ సీటును గెలుచుకున్న టీడీపీ
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా... 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా... 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. వైసీపీ తరపున బొమ్మి ఇజ్రాయెల్ (22 ఓట్లు), ఏసురత్నం (22), పోతుల సునీత (22), సూర్యనారాయణరాజు (22), మర్రి రాజశేఖర్ (22) గెలుపొందారు. వైసీపీ ఇతర అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు 21 ఓట్లు చొప్పున రావడంతో... రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో వెంకటరమణ అంతిమ విజయం సాధించారు. వెంకటరమణ ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరడం గమనార్హం.
సాంకేతికంగా టీడీపీకి 23 స్థానాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్ (విశాఖ దక్షిణం) వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీకి 19 సీట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి.
టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని, ఈ ఏడు సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంటామని వైసీపీ నాయకత్వం మొదట భావించింది. కానీ ప్రతిపక్షం అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను పోటీలో నిలిపింది. వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్) తిరుగుబాటు చేయడం టీడీపీ ఆశలకు ఊపిరి పోసింది. వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్లే అనురాధ గెలుపు సాధ్యమయ్యిందనేది స్పష్టం అవుతోంది. 23 ఓట్లతో అనురాధ విజయం సాధించారు. అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. కానీ అనురాధకు 23 ఓట్లు పడ్డాయి.
గెలిచిన అభ్యర్థులు వీరే..
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా గెలుపు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొమ్మి ఇజ్రాయిల్ ఎమ్మెల్సీగా గెలుపు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా విజయం
- వైఎఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం ఎమ్మెల్సీగా విజయం
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెన్మత్స సూర్యనారాయణ రాజు ఎమ్మెల్సీగా విజయం
- టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం
- రెండో ప్రాధాన్యత ఓటులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ విజయం
(The above story first appeared on LatestLY on Mar 23, 2023 08:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

