AP Road Accident: ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, కాన్వాయ్‌లోని వాహనాన్ని ఎదురుగా వచ్చి ఢీకొట్టిన మరో కారు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. సంక్రాంతి పండుగ వేళ బంధువుల ఇంటికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. సంక్రాంతి పండుగ వేళ బంధువుల ఇంటికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్తుండగా మార్గ మద్యంలో ప్రమాదం చోటుచేసుకుంది.
ఎదురుగా వచ్చిన ఓ కారు మిథున్ రెడ్డికి చెందిన కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ కారు పల్టీలు కొట్టి కిందపడిపోయింది. ప్రమాద సమయంలో మంత్రి పెద్దిరెడ్డి కారులో మిథున్ రెడ్డి కూడా ఉండటంతో ప్రమాదం తప్పింది. ఇక, ఈ ప్రమాదంలో మిథున్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 16, 2023 08:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

