AP Shocker: ఒకే మహిళతో ఇద్దరు సంబంధం, ఇక నీవు పడుకోలేవంటూ ఓ వ్యక్తి పురుషాంగాన్ని గాజుతో కోసేసిన మరో వ్యక్తి, సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన, నిందితుడు అరెస్ట్

ఏపీలో సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను సంబంధం పెట్టుకున్న మహిళతో ఇంకొకరు సంబంధం పెట్టుకోవడంతో సహించలేని ఓ వ్యక్తి సంబంధం పెట్టుకున్న వ్యక్తి పురుషాంగాన్ని (man Cuts Off Genitals Of Man) కోసేశాడు.

AP Shocker: ఒకే మహిళతో ఇద్దరు సంబంధం, ఇక నీవు పడుకోలేవంటూ ఓ వ్యక్తి పురుషాంగాన్ని గాజుతో కోసేసిన మరో వ్యక్తి, సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన, నిందితుడు అరెస్ట్
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Vjy, Oct 31: ఏపీలో సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను సంబంధం పెట్టుకున్న మహిళతో ఇంకొకరు సంబంధం పెట్టుకోవడంతో సహించలేని ఓ వ్యక్తి సంబంధం పెట్టుకున్న వ్యక్తి పురుషాంగాన్ని (man Cuts Off Genitals Of Man) కోసేశాడు. పురుషాంగాన్ని కోసిన కేసులో నిందితుడిని మడకశిర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను శనివారం మడకశిర పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ నాగేంద్ర వెల్లడించారు.

మడకశిరలోని పాత, కొత్త ఎస్సీ కాలనీలకు చెందిన బాలకృష్ణ, నాని.. ఒకే మహిళతో వివాహేతర సంబంధాన్ని (Extra-Marital Affair) కొనసాగిస్తున్నారు. ఈ విషయంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో నానిపై కక్ష పెంచుకున్న బాలకృష్ణ ఎలాగైనా అతణ్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ నెల 21న రాత్రి మడకశిరలోని ఓ థియేటర్‌ వద్దకు నానిని రప్పించుకున్నాడు. అనంతరం థియేటర్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఇద్దరూ కలసి మద్యం సేవించారు. మద్యం మత్తులో నానితో గొడవ పడిన బాలకృష్ణ పక్కనే ఉన్న ఖాళీ సీసాతో నాని తలపై బలంగా కొట్టాడు. కట్టెలతో దాడి చేశాడు. ఘటనతో నాని స్పృహ కోల్పోయాడు.

15 మందితో పాడు పని, భర్త వద్దని చెప్పడంతో ప్రియుడి సాయంతో మర్మాంగాన్ని కోసి దారుణంగా చంపేసిన భార్య, కటాకటాల్లోకి నిందితులు

అనంతరం అక్కడే పడి ఉన్న గాజు ముక్కలు తీసుకుని నాని మర్మాంగాన్ని కోసి బాలకృష్ణ పరారయ్యాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శనివారం ఉదయం వడ్రపాళ్యం వద్ద తచ్చాడుతున్న బాలకృష్ణను గుర్తించి అరెస్ట్‌ చేశారు.

(The above story first appeared on LatestLY on Oct 31, 2022 08:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).