Group 1 & 2 Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్-1లో 100 పోస్టులు, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీకి ఈ నెల చివరలో నోటిఫికేషన్‌

ఏపీలో ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్‌లు ఇస్తామని, గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Group 1 & 2 Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్-1లో 100 పోస్టులు, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీకి ఈ నెల చివరలో నోటిఫికేషన్‌
Former DGP Gautam Sawang Appointed as APPSC Chairman (photo-Twitter)

ఏపీలో ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్‌లు ఇస్తామని, గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

2022 గ్రూప్ వన్ ప్రక్రియను రికార్డుస్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ గ్రూప్ వన్ ప్రక్రియ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో రెండు పేపర్ల స్ధానంలో ఒకే పేపర్ ఉంటుందని తెలిపారు. గ్రూప్ వన్ మెయిన్స్ లో అయిదు పేపర్లకు బదులు నాలుగే ఉంటాయన్నారు. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో, రెండు పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయని చెప్పారు.

నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, యూనివర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

లాంగ్వేజ్ లో రెండు పేపర్లకి బదులు ఒక పేపర్ మాత్రమే ఉంటుందన్నారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. నిరుద్యోగ అభ్యర్ధులకు మేలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లలో పరీక్షలను పరిశీలించిన తర్వాతే మార్పులు చేశామన్నారు. డిసెంబర్ లో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిపి జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

(The above story first appeared on LatestLY on Nov 01, 2023 10:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).