Fire Accident in Bus: నర్సింగ్ కళాశాల విద్యార్ధులకు తప్పిన పెను ప్రమాదం.. కళాశాల బస్సు దగ్ధం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ఘటన (వీడియో)
ఏపీలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై బస్సులో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తృటిలో తప్పించుకున్నారు.
Bapatla, Nov 30: ఏపీలోని (AP) బాపట్ల (Bapatla) జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై బస్సులో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తృటిలో తప్పించుకున్నారు. పరీక్షలు రాసేందుకు కళాశాల బస్సులో నర్సింగ్ విద్యార్ధినులు వెళుతున్న సమయంలో ఈ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బస్సు రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యా సంస్థకు చెందినదిగా తెలుస్తుంది. విద్యుదఘాతంతో బస్సు నుంచి మంటలు చెలరేగినట్టు సమాచారం.
Here's Video:
బస్సులో మంటలు... పూర్తిగా దగ్ధం
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు
పూర్తిగా దగ్ధమైన ఐఆర్ఈఎఫ్ నర్సింగ్ కాలేజీ బస్సు
ఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు
మంటలు అంటుకోగానే విద్యార్థులు కిందకు దిగడంతో తప్పిన పెను ప్రమాదం… pic.twitter.com/hipxQLd7cw
— BIG TV Breaking News (@bigtvtelugu) November 30, 2024
విద్యార్థినులు గమనించడంతో..
అయితే, ముందుగానే పొగను గుర్తించి విద్యార్థినులు బస్సు నుంచి దిగిపోయారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. 30 మంది విద్యార్థినులు దిగిపోయిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు స్పందించి నీళ్లు చల్లినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. రేపల్లె అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.
(The above story first appeared on LatestLY on Nov 30, 2024 10:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

