Chandrababu Arrest Update: విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు.. న్యాయస్థానానికి ఈ ఉదయం రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. కోర్టు వద్ద భారీ భద్రత... కొనసాగుతున్న విచారణ
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నిన్న అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈమేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు.
Vijayawada, Sep 10: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు(Skill Development Scam Case)లో నిన్న అరెస్టయిన టీడీపీ (TDP) అధినేత చంద్రబాబును (Chandrababu) ఏపీ సీఐడీ (APCID) అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈమేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోవడంతో, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ మార్పును కోర్టుకు తెలియపరుస్తూ సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. అంతకుముందు, విచారణ ప్రారంభం సమయంలో తన చాంబర్ లో విచారిస్తానని న్యాయమూర్తి సూచించగా, ఓపెన్ కోర్టు విచారణ జరగాలని టీడీపీ న్యాయవాదుల బృందం కోరింది. దాంతో న్యాయమూర్తి ఓపెన్ కోర్టు విచారణకు అంగీకరించారు.
Pawan Kalyan Arrest: పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్
కోర్టు వద్ద భారీ భద్రత
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపిస్తుండగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు రిమాండ్ పిటిషన్ విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(The above story first appeared on LatestLY on Sep 10, 2023 08:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

