Chiranjeevi Meets YS Jagan: ఏపీ సీఎంతో మెగాస్టార్ భేటీ, టికెట్ రేట్లు, ఇండస్ట్రీ సమస్యలపై కీలక చర్చ, రేట్ల విషయం తేలేనా?
ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Meets YS Jagan). టికెట్ల రేట్లతో పాటూ, సినీ పరిశ్రమకు సంబంధిచిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. మద్యాహ్నం లంచ్ సమయంలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైయస్ జగన్(YS Jagan) తో సమావేశమయ్యారు చిరంజీవి(Chiranjeevi).
Vijayawada January 13: ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Meets YS Jagan). టికెట్ల రేట్లతో పాటూ, సినీ పరిశ్రమకు సంబంధిచిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. మద్యాహ్నం లంచ్ సమయంలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైయస్ జగన్(YS Jagan) తో సమావేశమయ్యారు చిరంజీవి(Chiranjeevi). ఇండస్ట్రీ తరపున సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు వచ్చానని మెగాస్టార్ తెలిపారు.
గత కొన్ని రోజుల నుంచి ఏపీలో టికెట్ ధరలు(Tickets rates in AP) సహా థియేటర్స్ వ్యవస్థకి సంబంధించిన విషయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV), ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని(Perni Nani)ల మధ్య కూడా ట్వీట్ల వార్ తర్వాత చర్చలు జరిపారు. అదే క్రమంలో టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు సహా హీరోలకి మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నేతలకి మద్య చాలాసార్లు కీలక సమావేశాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఏపీలో టికెట్ ధరలు సహా చిత్రపరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించేదుకు సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
(The above story first appeared on LatestLY on Jan 13, 2022 02:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

