Chittoor Car Accident: చిత్తూరులో ఘోర ప్రమాదం, చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం, కల్వర్టును ఢీకొట్టి కారులో చెలరేగిన మంటలు

చిత్తూరు(Chittoor) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి(Chandragiri) మండలం ఐతేపల్లి వద్ద వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు.

Chittoor Car  Accident: చిత్తూరులో ఘోర ప్రమాదం, చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం, కల్వర్టును ఢీకొట్టి కారులో చెలరేగిన మంటలు

Chittoor: చిత్తూరు(Chittoor) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి(Chandragiri) మండలం ఐతేపల్లి వద్ద వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి(Tirupathi) లోని రుయా(RUIA) ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.

Cheddi Gang Video: కర్రలు పట్టుకుని చెడ్డీ గ్యాంగ్ ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూడండి, విజయవాడలో అలజడి రేపుతున్న చెడ్డీ గ్యాంగ్, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు

ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. కారు నెంబరు AP39HA 4003గా గుర్తించారు. మృతులు విజయనగరం(Vijayanagaram) జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం వాసులుగా గుర్తించారు.

(The above story first appeared on LatestLY on Dec 05, 2021 06:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).