ఇటీవల విజయవాడ చిట్టీనగర్‌లోని చెనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద ఉన్న శివదుర్గ అపార్ట్‌మెంట్లోకి ప్రవేశించి డబ్బు, బంగారాన్ని చెడ్డీ గ్యాంగ్ చోరీ చేసింది. తాజాగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో ఓ అపార్ట్‌మెంట్‌లో చెడ్డీ దొంగలు హల్‌చల్ (Cheddi gang commit robbery in houses) సృష్టించారు. ఐదుగురు అగంతకులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కర్రలు చేత బట్టుకుని, చెడ్డీలపై అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు.

అర్ధరాత్రి సమయంలో అలికిడి అవ్వటంతో అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్ యజమానికి అనుమానం వచ్చి వెంటనే క్యారీడార్‌లో లైట్లు వేశాడు. దీంతో ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజ్(Cheddi Gang Video) ఆధారంగా కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)