విజయవాడలో రామవరప్పాడు రింగ్ రోడ్ వద్ద ఓ ప్రైవేట్ కళాశాల బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురవగా, వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గన్నవరం నుంచి గుణదల వైపు ప్రయాణిస్తున్న ఎస్‌ఆర్ కళాశాల బస్సు, దాదాపు 30 మంది విద్యార్థులతో వెళుతుండగా బస్ డ్రైవర్ వీరాస్వామికి రామవరప్పాడు రింగ్ వద్ద గుండెపోటు వచ్చింది. బస్ నియంత్రణ కోల్పోయి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు, బస్సు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అక్కడే ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న నాల్గో పట్టణ ట్రాఫిక్ సీఐ రమేశ్ కుమార్, ఎస్సై రాజేశ్ పరిస్థితిని చూసి వెంటనే బస్సు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వీరాస్వామికి ఇద్దరూ కలిసి సీపీఆర్ (CPR) చేశారు. వారి వేగవంతమైన చర్య వల్ల డ్రైవర్‌కు శ్వాస తిరిగి వచ్చింది. తర్వాత అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, బస్సు డ్రైవర్‌ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని చికిత్సకు అందించారు. ప్రస్తుతానికి పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. బస్సు ఢీకొనడం వల్ల ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగకపోవడం, ముఖ్యంగా విద్యార్థులు అంతా సురక్షితంగా బయటపడడం పెద్ద ఊరట. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది పోలీసులు చేసిన సేవకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
major accident was averted in Ramavarappadu
A major accident was averted in Ramavarappadu, #Vijayawada , on Tuesday morning.
A #SchoolBus reportedly carrying about 30 students was heading towards Gunadala when the #driver suffered a #CardiacArrest (#heartattack) and he lost control of the vehicle, hit a two-wheeler and… pic.twitter.com/GcB0EXWrLR
— Surya Reddy (@jsuryareddy) September 23, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)