టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం (Turkey Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదయింది. రాత్రి 10.48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి (Sindirgi) పట్టణాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు. ఇస్తాంబుల్, ఇజ్మీర్‌, బుర్సా, మానిసా వంటి నగరాల్లో భూకంప ప్రభావానికి వణికిపోయాయి. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి.జనం ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఇప్పటివరకు 22 మంది గాయపడినట్లు తెలుస్తున్నది. పశ్చిమ టర్కీలో గత మూడు నెలల్లో ఇది రెండో అతిపెద్ద భూకంపం అని చెప్పవచ్చు. 2023లో టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ధాటికి 59 వేల మంది మరణించారు. కోటాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.

17కి.మీ వేగంతో తీరం వైపు దూసుకువస్తోన్న మొంథా తుఫాను, ఎగసిపడుతున్న అలలు, రేపు తీరం దాటే అవకాశం, అత్యవసర సాయంపై ఏపీ చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..

Turkey Earthquake Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)