టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు మృతి చెందారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని సమాచారం.  అంకారాలోని తుర్కియే ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెనీ టుసాస్‌ ఆవరణలో ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే, దాడికి తామే కారణమని ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. తుర్కియే ఇంటీరియర్‌ మినిస్టర్‌ ‘ఎక్స్‌’ పోస్టులో టర్కిష్‌ ఏరో స్పేస్‌, డిఫెన్స్‌ కంపెనీ ఆవరణలో దాడి జరిగిందని పేర్కొన్నారు.టర్కిష్‌ శివారులో ఉన్న ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అంకారా కహ్రమంకజన్ ఫెసిలిటీపై తీవ్రవాద దాడి జరిగిందని అలీ యెర్లికాయ తెలిపారు. ఉగ్రదాడికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పోటీ పడుతున్న కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్, ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్న 2.1 కోట్ల మంది ప్రజలు

 Here's Attack Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)