RTC Bus Accident in Roddavalasa: ఏపీలో మరో బస్సు ప్రమాదం వీడియో ఇదిగో, మన్యం జిల్లాలో మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి.
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి.
OD 10S 6754 బస్సులో మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. చెక్‌పోస్టు వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. దీంతో, ప్రాణాపాయం తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది.. చేవెళ్ల దగ్గర మరో ప్రమాదంలో 19 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనల కారణంగా మృతుల కుటుంబాలు ఇంకా శోకసంద్రంలోనే ఉన్నాయి.
RTC Bus Accident in Roddavalasa:
బ్రేకింగ్
మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం
పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ఆర్టీసీ బస్సులో ప్రమాదం
విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధం
ఉదయం 7.45 కు ఆంధ్రా-ఒడిశా ఘాట్‌రోడ్డులో ప్రమాదం
డ్రైవర్ అప్రమత్తతతో బస్సు నిలిపివేయడంతో తప్పిన ప్రాణనష్టం.
ఘటనాస్థలికి… https://t.co/BL2V7FL0xx pic.twitter.com/me90mCP54j
— Telugu Feed (@Telugufeedsite) November 6, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 06, 2025 01:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

