ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా బర్హాజ్ గంగా ఘాట్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులతో నిండిన ఓ పడవ సరయూ నదిలో బోల్తా పడింది. సమాచారం ప్రకారం, ఆ పడవలో 12 మంది భక్తులు ఉన్నారు.ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, నదిలో బలమైన ప్రవాహం ఉండటంతో పాటు పడవ ఓవర్‌లోడ్ కావడం వల్ల అది సమతుల్యత కోల్పోయి 20 అడుగుల లోతులోకి మునిగిపోయింది. ఘటన జరిగిన వెంటనే అక్కడ హడావుడి వాతావరణం నెలకొంది.

టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వ‌ల్లే బస్సు ప్ర‌మాదం, చేవెళ్ల బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి, 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

స్థానిక డ్రైవర్లు, పడవ నడిపేవారు, పోలీసులు తాళ్లు, చెక్కపలకల సహాయంతో రక్షణ చర్యలు ప్రారంభించారు. పలువురిని సురక్షితంగా తీరం చేర్చగా, కొంతమంది ఇంకా గల్లంతైనట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కార్తీక పౌర్ణిమ సందర్భంగా ఉత్తరప్రదేశ్ అంతటా గంగా, సరయూ, యమునా నదీ తీరాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. బర్హాజ్ ఘాట్ వద్ద కూడా వేలాది మంది చేరడంతో అక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రక్షణ చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మిస్సింగ్‌గా ఉన్న వారిని గాలించడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు శ్రమిస్తున్నాయి.

Several Devotees Rescued After Boat Capsizes in Saryu River

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)