మహారాష్ట్రలో కదులుతున్న ట్రక్కుపై సినిమా తరహాలో దొంగతనం జరిగినట్లుగా చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని సోలాపూర్-ధులే హైవేపై ఉన్న ధరాశివ్ గ్రామం దగ్గర ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. కెమెరాలో రికార్డైన ఈ దోపిడీ చర్యలో ధారాశివ్ గ్రామంలో పట్టపగలు కదులుతున్న ట్రక్కు నుండి దొంగల గుంపు దొంగతనం చేస్తున్నట్లు చూపిస్తుంది. ఫ్రీ ప్రెస్ జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారం.. దొంగల గుంపు కదులుతున్న ట్రక్కుపైకి ఎక్కి వస్తువులను దొంగిలించడం చూడవచ్చు. దొంగలు ఆ వాహనాన్ని అనుసరిస్తున్న మరో దింగల గుంపుకు దోపిడి వస్తువులను అందజేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. వైరల్ క్లిప్ పోలీసుల చేరడంతో త్వరితతిన చర్యలు చేపట్టారు. ధరాశివ్ స్థానిక క్రైమ్ బ్రాంచ్ (LCB) ఫుటేజీని సమీక్షించి ఆరుగురు అనుమానితులను గుర్తించింది.ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. షాకింగ్ వీడియో, కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ ప్లేట్‌లో చనిపోయిన బొద్దింక, ఒక్కసారిగా షాక్ కు గురైన కస్టమర్, తర్వాత ఏమైందంటే..
Robbery Caught on Camera in Maharashtra
Movie-style robbery caught on camera at Kolhapur highway at Dharashiv; Police nabs two@fpjindia #maharashtra #news #crime #viralvideo pic.twitter.com/lMpyflswTn
— Manasi (@Manasisplaining) September 11, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)