Miss Universe India Contestant: మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు

ఏపీలోని కుప్పం నియోజకవర్గంలోని ఎంకే పురానికి చెందిన యువతి చందన జయరాం అరుదైన గుర్తింపు సాధించారు. మిస్ యూనివర్స్–ఇండియాకు ఏపీ నుంచి ఆమె అర్హత సాధించారు.

Miss Universe India Contestant: మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు
Miss Universe India Contestant

Kuppam, Aug 3: ఏపీలోని (AP) కుప్పం (Kuppam) నియోజకవర్గంలోని ఎంకే పురానికి చెందిన యువతి చందన జయరాం అరుదైన గుర్తింపు సాధించారు. మిస్ యూనివర్స్–ఇండియాకు (Miss Universe India Contestant) ఏపీ నుంచి ఆమె అర్హత సాధించారు. ఈ క్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయంలో సీఎం చంద్రబాబును చందన కలిశారు. ఈ సందర్భంగా కుప్పం పేరును జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చందనకు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్‌ లో నిర్వహించిన పోటీల్లో చందన మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపిక అయ్యారు. తన నియోజకవర్గం కుప్పం నుంచి మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు చందన అర్హత సాధించడంపై సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకటన, పూర్తి వివరాలివే, చివరి రోజు కీలక బిల్లులకు అమోదం,అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్

వచ్చే నెలలో పోటీలు

ముంబై‌లో వచ్చే నెలలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో చందన మిగతా పోటీదారులతో జరిగే కాంపిటిషన్ లో పాల్గొననున్నారు. ఇందులో విజేతగా గెలిస్తే, మిస్ యూనివర్స్ పోటీలో భారత్ నుంచి ఆమె అధికారికంగా పాల్గొననున్నారు.

అసెంబ్లీలో బూతులతో రెచ్చిపోయిన దానం నాగేందర్, తోలు తీస్తా, బయట తిరగనియ్య అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వీడియో ఇదిగో..

(The above story first appeared on LatestLY on Aug 03, 2024 08:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).