AP CM Jagan: ప్రకాశం, విజయవాడ, విశాఖలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన.. నేడు వైసీపీ నేత అశోక్ బాబు తల్లికి నివాళి.. సాయంత్రం గవర్నర్ తో భేటీ.. రేపు విశాఖలో జీ20 ప్రతినిధులతో సమావేశం
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండ్రోజుల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ, రేపు ప్రకాశం, విజయవాడ, విశాఖలో పర్యటించనున్నారు.
Vijayawada, March 27: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) రెండ్రోజుల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ (Schedule) ఖరారైంది. ఇవాళ, రేపు ప్రకాశం (Prakasham), విజయవాడ (Vijayawada), విశాఖలో (Vishakhapatnam) పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చేరుకుంటారు. 11.15 గంటలకు కొండెపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు నివాసంలో ఆయన తల్లి కోటమ్మ భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు.
28న జీ-20 ప్రతినిధులతో ఇంటరాక్షన్
28వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరి 5.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌కు చేరుకుని రాత్రి 7-8 గంటల మధ్య జీ-20 ప్రతినిధులతో జరిగే ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'గాలా డిన్నర్'లో పాల్గొని రాత్రి 8.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
(The above story first appeared on LatestLY on Mar 27, 2023 08:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

