East Godavari Shocker: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం, ఇంటి పక్క సందులో యువతిపై అత్యాచార యత్నం, ప్రతిఘటించడంతో దాడి చేసిన కామాంధుడు, ఆస్పత్రిలో బాధితురాలు, కేసు నమోదు చేసిన పోలీసులు

ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు యువతిపై లైంగిక దాడికి (Young Man Try To Rape Young girl) ప్రయత్నం చేశాడు. యువతి ప్రతిఘటించడంతో ఆమెను గాయపరిచాడు.

East Godavari Shocker: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం, ఇంటి పక్క సందులో యువతిపై అత్యాచార యత్నం, ప్రతిఘటించడంతో దాడి చేసిన కామాంధుడు, ఆస్పత్రిలో బాధితురాలు, కేసు నమోదు చేసిన పోలీసులు
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Karapa, july 18: ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు యువతిపై లైంగిక దాడికి (Young Man Try To Rape Young girl) ప్రయత్నం చేశాడు. యువతి ప్రతిఘటించడంతో ఆమెను గాయపరిచాడు. ఈ దారుణ ఘటన జిల్లాలోని కరప మండలం (East Godavari Karapa) వేళంగిలో చోటుచేసుకుంది

కరప ఎస్సై డి.రమేష్‌బాబు, స్థానికుల కథనం ప్రకారం.. వేళంగికి చెందిన యువతి ఇంటర్మీడియెట్‌ చదివి తల్లిదండ్రులతో కలిసి ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తోంది. ఈ నెల 13 రాత్రి ఆమె ఇంటి పక్కనే ఉంటున్న విత్తనాల రమేష్‌ అనే యువకుడు తన మొబైల్‌ ఫోన్‌ నుంచి ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి కృతజ్ఞతలు తెలిపిన ఆ యువతి.. కొద్దిసేపటికి రూ.2 వేలు అప్పుగా ఇస్తే, నాలుగు రోజుల్లో ఇచ్చేస్తానని అడిగింది.

అయితే ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు నగదు ఇస్తానని ఇంటి పక్కన ఉన్న సందులోకి ఆమెను రమ్మ న్నాడు. తెలిసిన వ్యక్తే కదా అని డబ్బుల కోసం అక్కడకు వెళ్లగా అతడు ఆ యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆగ్రహించిన రమేష్‌.. ఆ యువతి గొంతు పట్టుకుని గోడకు గుద్దాడు. అంతే కాకుండా విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చాడు. భయపడిన ఆ యువతి కేకలు వేయడంతో ఆమె గొంతు, ఎడమ చేతిని కొరికి గాయపరిచాడు.

పోలీసా..లేక కామాంధుడా, ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై పలుమార్లు అత్యాచారం, గుజరాత్‌లో దారుణ ఘటన, కర్ణాటకలో మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన మహిళపై లైంగిక దాడికి పాల్పడిన మరో కానిస్టేబుల్

ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు బాధితురాలు తెలిపింది. ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాధితురాలి కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. అపస్మారక స్థితిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ చట్టం, ఇతర సెక్షన్లతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేష్‌బాబు వివరించారు.

(The above story first appeared on LatestLY on Jul 18, 2021 03:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).