YSRCP Fees Poru: ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ ఫీజుపోరు, రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన జగన్ పార్టీ, చంద్రబాబు పాలనలో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని మండిపాటు..

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్‌ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు.

YSRCP Fees Poru: ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ ఫీజుపోరు, రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన జగన్ పార్టీ, చంద్రబాబు పాలనలో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని మండిపాటు..
YSRCP Fees Poru (photo-YSRCP)

Vjy, Jan 30: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనకు రెడీ అయింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ చేపట్టే 'ఫీజుపోరు' కార్యక్రమం పోస్టర్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు.. విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు. దీనివలన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారన్నారు.విద్యార్థులకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది. గడిచిన 8 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు 420 అంటూ జనం విమర్శలు చేస్తున్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకపోతే పోరాటం తీవ్ర రూపం చేస్తాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.

సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్‌ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు. బాధిత విద్యార్థుల తరపున పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. కలెక్టరేట్ల ఎదుట ఫిబ్రవరి 5న పోరాటం చేస్తాం. చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే రిలీజ్ చేయాలని జోగి రమేష్ అన్నారు.

వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు కూడా ఇవ్వడం లేదు. జగన్ అభివృద్ధి చేసిన స్కూళ్లను చూసి పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యపోయారు. ప్రైవేట్‌ స్కూల్‌కు పోటీగా ప్రభుత్వ స్కూల్ ఉందని మెచ్చుకున్నారు.

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 06:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).