Penna River Tragedy:విషాదం..పెన్నానదిలో నాలుగు మృతదేహాలు లభ్యం, మొత్తం ఏడుగురు గల్లంతు, మిగతా ముగ్గురి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

వైయస్సార్ కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహంలో నిన్న గల్లంతయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Penna River Tragedy:విషాదం..పెన్నానదిలో నాలుగు మృతదేహాలు లభ్యం, మొత్తం ఏడుగురు గల్లంతు, మిగతా ముగ్గురి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
Penna River Tragedy (Photo-Twitter)

Kadapa, Dec 18: వైయస్సార్ కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహంలో నిన్న గల్లంతయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గజ ఈతగాళ్ల కోసం గాలిస్తున్నారు. సిద్దవటంలో స్నేహితుడి ఇంట కర్మకాండ కార్యక్రమానికి వచ్చి ఏడుగురు యువకులు జలసమాధి అయ్యారు. జలసమాధి అయిన వారిలో... జగదీష్, తరుణ్, షణ్ముఖం, రాజేష్, సోమశేఖర్, జశ్వంత్, సతీష్ ఉన్నారు.

పోలీసుల ప్రాధమిక దర్యాప్తు మేరకు.. తిరుపతి కోరగుంటకు చెందిన సోమశేఖర్‌, యశ్‌, జగదీశ్‌, సతీష్‌, చెన్ను, రాజేష్‌, తరుణ్‌ సిద్ధవటం పెన్నానది వద్దకు విహారయాత్రకు వచ్చారు. సరదాగా ఈత కొడదామని నదిలో దిగారు. దీంతో వారు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు కొనసాగిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 18, 2020 11:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).