Free Bus Service In Srisailam: శ్రీ‌శైలం వెళ్లే భ‌క్తుల‌కు ఫ్రీ బ‌స్, కార్తీక మాసం సంద‌ర్భంగా ప్రారంభించిన అధికారులు

శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం శుక్రవారం సాయంత్రం నుంచి ఉచిత బస్సు సౌకర్యం (Free bus) ప్రారంభించింది. వారాంతపు సెలవులతోపాటు పర్వ దినాల్లో అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి (Free Bus in Srisailam) భక్తులు తరలి వస్తున్నారు.

Free Bus Service In Srisailam: శ్రీ‌శైలం వెళ్లే భ‌క్తుల‌కు ఫ్రీ బ‌స్, కార్తీక మాసం సంద‌ర్భంగా ప్రారంభించిన అధికారులు

Srisailam, NOV 22: శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం శుక్రవారం సాయంత్రం నుంచి ఉచిత బస్సు సౌకర్యం (Free bus) ప్రారంభించింది. వారాంతపు సెలవులతోపాటు పర్వ దినాల్లో అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి (Free Bus in Srisailam) భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థమై వారాంతపు రోజుల్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ గణేశ్ సదన్ నుంచి అన్న ప్రసాద భవనం మీదుగా క్యూ కాంప్లెక్స్ వరకూ భక్తులు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పెళ్లి చేయడంలేదని తండ్రిని రూంలో బంధించి చితకబాదిన కొడుకులు, కర్నూలు జిల్లాలో షాకింగ్ ఘటన 

ఈ ఉచిత బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం నరసింహారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఐ/సీ) పీ చంద్రశేఖర శర్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

(The above story first appeared on LatestLY on Nov 22, 2024 09:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).