Gang Rape: రాత్రి బైక్ పై ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళ.. వాహనాన్ని వెంబడించిన దుండగులు.. నిర్మానుష్య ప్రదేశం రాగానే ఆమె బైక్ ను బలంగా ఢీకొట్టిన కామంధులు.. మహిళ కిందపడగానే పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. ఒంగోలులో దారుణం

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వివాహితను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన దుండగులు ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగిందీ ఘటన.

Gang Rape: రాత్రి బైక్ పై ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళ.. వాహనాన్ని వెంబడించిన దుండగులు.. నిర్మానుష్య ప్రదేశం రాగానే ఆమె బైక్ ను బలంగా ఢీకొట్టిన కామంధులు.. మహిళ కిందపడగానే పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. ఒంగోలులో దారుణం
Rape (Representational Image: Google)

Ongole, October 14: బైక్ పై (Bike) వెళ్తున్న వివాహితపై (Married Women) దుండగుల కన్ను పడింది. ఉద్దేశపూర్వకంగా ఆమె వాహనాన్ని ఢీకొట్టిన వాళ్ళు.. ఆపై సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole) శివారులో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ ప్రతి రోజూ ద్విచక్ర వాహనంపై ఒంగోలు వచ్చి కూరగాయలు (Vegetables) అమ్మి వెళ్తుంటుంది. రోజులానే మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఒంగోలు నుంచి తిరిగి వెళ్తుండగా పూటుగా మద్యం తాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఆమెను వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆమె వాహనాన్ని ఢీకొట్టారు. కిందపడిన ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యారు.

‘బాబూ పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఇంటికి రా..’, ‘డబ్బులు లేవండి’, ‘పర్లేదు.. చార్జీలకు రూ.200 గూగుల్ పే చేశాం.. రా’, యువకుడిని ఇంటికి రప్పించి మరీ హత్య.. అనంతరం మృతదేహం నాలాలోకి.. హైదరాబాద్ లో గగుర్పొడుస్తున్న పరువు హత్య..

రాత్రి పొద్దుపోతున్నా మహిళ ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెతుక్కుంటూ బయలుదేరారు. ఈ క్రమంలో ఆమె మధ్యలో తారసపడింది. జరిగిన విషయం వారికి చెప్పింది. దీంతో వారు నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో కొత్తపట్నం రోడ్డులోని ఓ పెట్రోలు బంకు వద్ద నిందితులు కనిపించారు. వారిని పట్టుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారు తర్వాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొప్పోలు సమీపంలోని చేపల చెరువుల వద్ద కాపలాదారులుగా పనిచేస్తున్నఇద్దరు యువకులే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Oct 14, 2022 09:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).