iMASQ Buses in AP: కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, ఐ-మాస్క్ బస్సుల్లో కోవిడ్-19 నిర్థారణ పరీక్షలు, విజయవాడలోనే 8 ఐ మాస్కు బస్సులు ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కరోనా నిర్థారణ పరీక్షలో ముందున్న ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐ-మాస్క్ బస్సుల్లో (iMASQ buses) కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేవలం ఒక్క విజయవాడ లోనే 8 బస్సులను (iMASQ) ఏర్పాటు చేసింది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు పరచాలనుకుంటున్నట్లు తెలిపారు.
Amaravati, July 3: దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కరోనా నిర్థారణ పరీక్షలో ముందున్న ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐ-మాస్క్ బస్సుల్లో (iMASQ buses) కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేవలం ఒక్క విజయవాడ లోనే 8 బస్సులను (iMASQ) ఏర్పాటు చేసింది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు పరచాలనుకుంటున్నట్లు తెలిపారు. టీడీపీకీ మరో దెబ్బ, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు, వైసీపీ నేత హత్య కేసులో రవీంద్రకు భాగం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ (AP Govt) ముందడుగు వేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan) ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా నిర్దారణ పరీక్షలను రికార్డు స్థాయిలో చేసింది.
విజయవాడలో 8 చోట్ల ఐ మాస్క్ బస్సులతో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నది. విజయవాడలో రోజుకు రెండు వేలమందికి కరోనా టెస్టులు (Coronavirus Tests) నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, చికిత్సతో కరోనా వ్యాధి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటికే, రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల శాతాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచింది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరి డేటాను వలంటీర్లు, హెల్త్ వర్కర్లు సేకరిస్తున్నారు. మాస్కులు లేకుండా బయటకు రావద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చాక తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లరాదని కోరుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్‌ల ద్వారా కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో కేంద్ర నిబంధనల ప్రకారం అన్‌లాక్ 2.0ను అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఏపీలోకి అనుమతిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కొందరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ.. మిగతవారు వెనక్కి తగ్గకుండా మహమ్మారిపై పోరాటం కొనసాగిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 03, 2020 03:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

