Amaravati, July 3: ఇటీవల మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య (Moka Bhaskar Rao's Murder Case) తీవ్ర సంచలనం సృష్టించింది. అనుచరుడు చనిపోవడంతో మంత్రి పేర్ని నాని బోరున విలపించారు. ఎట్టకేలకు మోకా భాస్కరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. టీడీపీ నేత చింతా చిన్ని సహా మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ ఆధిపత్యం కోసమే భాస్కరరావును హత్య చేశారని పోలీసుల విచారణలో నిర్దారణ అయ్యింది. హత్య కేసులో మరికొందరినీ విచారించనున్నారు. వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య, సైనేడ్ పూసిన కత్తితో మోకా భాస్కర్ రావును హత్యచేసిన దుండుగులు, మచిలీపట్నంలో 144 సెక్షన్
భవిష్యత్తులో మోకా (YSRCP leader Moka Bhaskara Rao) రాజకీయంగా, సామాజికంగానూ మరింత బలపడితే తమకు మనుగడ ఉండదనే అక్కసుతో ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ణయానికి వచ్చారు. మోకాను హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం మచిలీపట్నం ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఆర్‌పేట, చిలకలపూడి సీఐలు కడలి వెంకటేశ్వరరావు, మోర్ల వెంకటనారాయణ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
స్నేహితుడు మృతి చెందటంతో మనస్థాపంతో మంత్రి పేర్ని నాని
నిజమైన స్నేహం అంటే ఇదేనేమో😥
మోకా భాస్కరరావు గారు మృతి చెందటంతో తీవ్ర మనస్థాపంతో మంత్రి #పేర్నినాని గారు...
మీమ్మల్లి ఇలా చూడలేకపోతున్నాం పెర్రి నాని గారు 😢😢😢@perni_nani pic.twitter.com/v4i00WBR2s
— Anitha reddy (@Anithareddyatp) June 30, 2020
మోకా భాస్కరరావు గారి భౌతికకాయాన్ని దర్శించి కన్నీటి పర్యతమైనా మంత్రి పేర్నినాని గారు pic.twitter.com/ewjPZDfVCg
— 2024YSRCP (@2024YSRCP) June 29, 2020
కాగా, ఈ హత్య కేసులో మొదటినుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Telugu desam party leader Kollu Ravindra) పేరు వినిపిస్తున్న సంగతి విదితమే భాస్కరరావు హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే జరిగిందంటూ కుటుంబసభ్యులు ఆరోపించటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతా చిన్నీ, నాంచారయ్య, కిషోర్‌లతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై (Ex TDP Minister Kollu Ravindra) ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. మోకా హత్యకేసుకు సంబంధించి మరింత దర్యాప్తు నిర్వహించిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించటం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు.
అలాగే ఈ కేసులో మరి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని పూర్తి వివరాలు అతి తొందరలోనే విలేకరులకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో, పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను నిందితుడిగా పరిగణిస్తూ ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వ్యక్తుల కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తోంది.అటు, గుమ్మటాల చెరువు విషయంలో మోకా భాస్కరరావుకు, కొల్లు రవీంద్రకు వివాదం ఉందని మోకా భాస్కరరావు అన్న కుమారుడు మోకా రాజేశ్ అంటున్నారు. మోకా భాస్కరరావు గతంలో రెండు పర్యాయాలు బందరు మార్కెట్ యార్డు చైర్మన్ గా వ్యవహరించారు.
జూన్ 29వ తేదీన బందర్ నడిబొడ్డున కత్తితో పొడిచి హత్యచేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 11.30 గంటలకు కోనేరు సెంటర్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో దాడి జరిగింది. ఇద్దరు ఆగంతకులు నిల్చొన్న భాస్కరరావును తోసేయగా.. కింద పడిపోయాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఛాతిలోకి పొడిచారు. కత్తి పోట్లకు జేబులో ఉన్న మొబైల్ పేలిపోయింది. ఒంటిపై ఉన్న చొక్కా కాలి.. శరీరంపై గాయాలు ఏర్పడ్డాయి. గుండెలో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో.. ఆస్పత్రికి తరలించే మార్గంలో భాస్కరరావు చనిపోయారు.