Indian Navy: విశాఖ బీచ్‌లో గల్లంతై నెల్లూరులో ప్రియుడితో ప్రత్యక్షమైన సాయిప్రియ వ్యవహారంపై ఇండియన్ నేవీ సీరియస్, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విశాఖ పోలీసులకు ఫిర్యాదు..
విశాఖ బీచ్‌లో గల్లంతై నెల్లూరులో ప్రియుడితో ప్రత్యక్షమైన సాయిప్రియ వ్యవహారంపై భారత నావికా దళం, నేడు విశాఖ పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేసింది. ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కోరింది.
విశాఖ బీచ్‌లో గల్లంతై నెల్లూరులో ప్రియుడితో ప్రత్యక్షమైన సాయిప్రియ వ్యవహారంపై భారత నావికా దళం, నేడు విశాఖ పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేసింది. ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కోరింది. తప్పుడు సమాచారంతో మూడు కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్‌ను రెస్క్యూ ఆపరేషన్ కోసం వినియోగించామని, ఇది అత్యంత ఖర్చుతో కూడిన ఆపరేషన్ అని, కేవలం ఒక ఆకతాయి పని వల్ల ప్రజాదనం వృదా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.తమ స్వార్థం కోసం ఇంత ప్రజా ధనాన్ని, అధికారుల సమయాన్ని వృథా చేయడం సరైంది కాదంటూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
(The above story first appeared on LatestLY on Jul 31, 2022 05:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

