Jobs in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్, ఆర్బీకేల పరిధిలో 7,384 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (Jagan Govt) అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు (RBK Centers ) ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు
Amaravati, Jan 6: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (Jagan Govt) అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు (RBK Centers ) ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా శాఖల వారీ ఖాళీగా ఉన్న 7,384 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
ఈ మేరకు ఆర్బీకేల ఏర్పాటు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్యను బట్టి శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు. అత్యధికంగా 5,188 పశుసంవర్ధక సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి తర్వాత 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా లెక్కతేల్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులను కూడా భర్తీ చేస్తే ఆర్బీకేల్లో పనిచేసేవారి సంఖ్య 21,731కి చేరుతుంది.
ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే.. 5 నుంచి 25 శాతం వరకు రాయితీ
ప్రస్తుతం ఆర్బీకేల్లో పనిచేస్తున్న మొత్తం 14,347 మందిలో ప్రధానంగా 6,291 మంది వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవర్ధక, 731 మంది మత్స్య, 317 మంది పట్టు సహాయకులు ఉన్నారు. స్థానికంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పట్టు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖల సహాయకులు స్థానిక ఆర్బీకేలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల్లో వ్యవసాయ, ఉద్యాన సహాయకులే ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు.కొన్నిటిలో మాత్రం పట్టు, మత్స్య సహాయకులు ఇన్‌చార్జ్‌లుగా పనిచేస్తున్నారు. ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖలకు చెందిన సహాయకులు సెకండ్ ఇన్‌చార్జిలుగా సేవలందిస్తున్నారు.
గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలందించే సంకల్పంతో 9,160 బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేశారు. వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్స్‌గా వీటిని తీర్చిదిద్దడంతోపాటు రైతులకు అందించే సేవలన్నింటినీ ఆర్బీకేలు కేంద్రంగా అందిస్తున్నారు. దీంతో ఆర్బీకేల్లో సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
(The above story first appeared on LatestLY on Jan 06, 2023 11:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

