Vijayawada, Jan 6: సంక్రాంతి పండుగ (Sankranti Festival) కోసం ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) అధికారులు సిద్ధం చేసిన ప్రత్యేక బస్సులు (Special Buses) నేటి నుంచే రోడ్డెక్కనున్నాయి. పండుగ స్పెషల్ బస్సుల టికెట్ ధరను (Ticket Price) గతేడాది 50 శాతం వరకు పెంచిన ఆర్టీసీ అధికారులు ఈసారి మాత్రం చార్జీలు (Charges) పెంచకపోగా ప్రత్యేక రాయితీలతో (Special Discounts) ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రణాళికలు రచించారు. పండుగ ప్రత్యేక బస్సుల్లో 5 నుంచి 25 శాతం వరకు రాయితీలు ప్రకటిస్తూ ప్రయాణికులు ‘ప్రైవేటు’వైపు చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రానుపోను ఒకేసారి రిజర్వు చేయించుకుంటే 10 శాతం, నలుగురికి మించి కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి ప్రయాణిస్తే 5 శాతం రాయితీ ఇస్తోంది. అలాగే, వాలెట్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తే 5 శాతం, వృద్ధుల చార్జీల్లో 25 శాతం తగ్గింపు ప్రకటించింది.
ఢిల్లీలో మరోసారి భూకంపం, నాలుగు రోజుల్లోనే రెండోసారి ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన ప్రజలు
సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచి ఈ నెల 14 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా 3,120 బస్సులను అధికారులు సిద్ధం చేశారు. పండుగ అనంతరం తిరిగి వచ్చే వారి కోసం 3,280 బస్సులు నడపనున్నారు. ఇవి ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ యాప్, వెబ్‌సైట్, అధికారిక ఏజెంట్ల ద్వారా రిజర్వేషన్ చేయించుకుని ప్రకటించిన రాయితీలు పొందొచ్చని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
సంక్రాంతి పండుగ కోసం టీఎస్ ఆర్టీసీ అధికారులు 4, 233 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు వీడియోలో..