India vs Sri Lanka (PIC @ ICC Twitter)

Pune, JAN 05:  పుణెలో శ్రీ‌లంక‌, టీం ఇండియా (India vs Sri Lanka) మ‌ధ్య జ‌రిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో (2nd T20I) శ్రీలంక విజ‌యం సాధించింది. 207 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీం ఇండియా చివ‌రి ఓవ‌ర్‌లో 21 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. అయితే శ్రీ‌లంక కెప్టెన్ శ‌న‌క (shanaka) చివ‌రి ఓవ‌ర్‌లో క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవ‌లం నాలుగు ప‌రుగులే ఇచ్చాడు. దీంతో టీం ఇండియాపై శ్రీ‌లంక (2nd T20I) 16 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో రెండు జ‌ట్లు చెరో పాయింట్‌తో స‌మ ఉజ్జీలుగా నిలిచాయి. టీం ఇండియా బ్యాట్స్‌మ‌న్లలో అక్షర్ ప‌టేల్ (Axar Patel) దూకుడుగా ఆడుతూ 19వ ఓవ‌ర్ వ‌ర‌కు 63 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు.

కానీ చివ‌రి ఓవ‌ర్‌లో లంక కెప్టెన్ శన‌క (Shanaka) బౌలింగ్‌లో రెండు ప‌రుగులు చేసి ఆలౌట్ కావ‌డంతో టీం ఇండియా ఆశ‌లు స‌న్నగిల్లాయి. అంత‌కుముందు 207 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీం ఇండియా బ్యాట‌ర్లు రెండో ఓవ‌ర్‌క‌ల్లా మూడు వికెట్లు స‌మ‌ర్పించుకున్నారు.