Karnataka Shocker: ఎస్ఐ రూపంలో కామాంధుడు, పోలీస్ స్టేషన్లో మహిళ నడుం గిల్లుతూ రూంలోకి ఓ గంట రావాలని వేధింపులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళతో ఎస్‌ఐ అసభ్యంగా ప్రవర్తిస్తూ రూంకి రావాలని వేధింపులకు గురి చేశాడు. వరకట్నం కేసుకు సంబంధించి సాక్షిగా వచ్చిన మహిళ పట్ల ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది.
Bengaluru, April 12: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళతో ఎస్‌ఐ అసభ్యంగా ప్రవర్తిస్తూ రూంకి రావాలని వేధింపులకు గురి చేశాడు. వరకట్నం కేసుకు సంబంధించి సాక్షిగా వచ్చిన మహిళ పట్ల ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. వరకట్నం విషయంపై సాక్షిగా సుద్ధగుంటపాళ్య పోలీసు స్టేషన్‌కు పిలుపించుకున్న ఎస్‌ఐ మంజునాథ్‌స్వామి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళలు ట్విట్టర్‌లో బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు.
కడుపున పుట్టిన బిడ్డల భవిష్యత్తుపై పూర్తి పెత్తనం, హక్కు తల్లిదండ్రులది కాదు: బాంబే హైకోర్టు
బాధితురాలి స్టేట్ మెంట్ ప్రకారం.. స్నేహితురాలి విడాకుల కేసులో సాక్షిగా వివరాలను ఇవ్వటానికి స్టేషన్‌కు వెళ్లాను. ఎస్‌ఐ మంజునాథస్వామి మొదట చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. అనంతరం అతడు విచారణ సమయంలో తన చేతులు పట్టుకుని ముద్దు పెట్టడానికి యత్నించాడని బాధితురాలు ఆరోపించారు. స్టేషన్‌లో కుర్చోన్న తన నడుం గిల్లి, క్యాబిన్ పక్కన ఉన్న రూంకు రావాలని పిలిచాడని, అదే సమయంలో మా అమ్మ ఫోన్ చేయటంతో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లటంతో అతడి నుంచి తప్పించుకున్నట్లు వివరించారు.
స్టేషన్‌లోనే కాకుండా ఇంటికి వచ్చిన తరువాత వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పెట్టి మానసికంగా వేధిస్తున్నట్లు బాధితురాలు ఎస్‌ఐపై ఆరోపణలు చేశారు. ఇంటికి వెళ్లాక వాట్సాప్‌లో తన ఫోటోలు పంపాలని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ ఘటనకు సంబంధించి బాధితురాలు ఫిర్యాదు చేసిందని డీసీపీ సీకే బాబా తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
(The above story first appeared on LatestLY on Apr 12, 2023 03:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

