Liquor Shops Bandh in AP: ఏపీలో జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్, ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా చూడాలని డీజీపీ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది.

Liquor Shops Bandh in AP: ఏపీలో జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్, ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా చూడాలని డీజీపీ ఆదేశాలు
Wine Shops (photo-X)

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది.

ఈ క్రమంలో జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు.  కౌంటింగ్‌ కు ఏపీ సన్నద్ధం.. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్.. స్ట్రాంగ్‌ రూమ్‌ ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలు.. కౌంటింగ్ రోజున డ్రై డే

అదేవిధంగా హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

(The above story first appeared on LatestLY on May 29, 2024 12:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).