Margadarsi Chit Fund Scam: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసు, రామోజీరావు, శైలజా కిరణ్‌లకు ఏపీ సీఐడీ నోటీసులు, జూలై 5న గుంటూరు సీఐడీ ఆఫీసుకు రావాలని ఆదేశాలు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న ఈ నాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌లు విచారణకు రావాలంటూ మరోసారి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇద్దరూ గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్‌కి జూలై5వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.
Guntur, June 22: మార్గదర్శి చిట్‌ఫండ్స్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న ఈ నాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌లు విచారణకు రావాలంటూ మరోసారి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇద్దరూ గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్‌కి జూలై5వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఏ-1గా రామోజీరావు ఉండగా, ఏ-2గా శైలజా కిరణ్‌లు ఉన్నారు. 41ఏ కింద వారికి నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ.ఈ నెల మొదటివారంలో ఏ-2గా ఉన్న శైలజా కిరణ్‌ను సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. శైలజా కిరణ్ నివాసంలోనే ఆమెను సీఐడీ విచారించింది.
కాగా, విచారణ కోసం శైలజ కిరణ్ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని 10 మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారన్నారు సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ . ఆర్థిక అక్రమాలను సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. తాము చట్టం పరిధిలోనే విచారిస్తున్నప్పటికీ శైలజ కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని చెప్పారు.
అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు. ఎండీ వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారన్నారు. విచారించిన ప్రతిసారీ ఏదో సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందన్నారు.
శైలజ కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులు రూ.793.50 కోట్లను ఆటాచ్ చేసేందుకు న్యాయస్థానంలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jun 22, 2023 02:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

