Fire (PIC @ Google)

Fire broke out in a private bus: ప్రకాశం జిల్లా కె.బిట్రగుంట జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నడిరోడ్డుపై బస్సు దగ్ధం అయింది.ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బుధవారం హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరికి 27 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో 16వ నంబర్‌ జాతీయ జాతీయ రహదారిపై సాంకేతిక సమస్య తలేత్తి బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వీడియో ఇదిగో, వివాహేతర సంబంధం అనుమానం, నడిరోడ్డు మీద యువకుడిపై కత్తులతో దాడి

ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. విషయన్ని గుర్తించిన డ్రైవర్‌ అప్రమత్తమై రోడ్డు పక్కన బస్సును నిలిపివేసి.. ప్రయాణికులను నిద్ర నుంచి లేపాడు. ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి దిగిపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ పూర్తిగా కాలిపోయింది. అదే మార్గంలో వెళ్తున్న వ్యక్తి ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు ఆర్పేశారు. ప్రమాదం జరిగిన తర్వాత జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ANI Video

సీఐ రంగనాథ్‌, ఎస్సై వెంకటేశ్వర్‌ రావు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. ప్రయాణికులను ఇతర వాహనాల ద్వారా వారి గమ్యస్థానలకు పంపించారు.