Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ మాస్ వార్నింగ్, మూడో కన్నుతెరిచానంటే జాగ్రత్త, సినిమాల విషయానికి రావొద్దని హెచ్చరిక

సినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య సినిమా పాటను ఒక వేడుకలో వేశారనే కారణంతో స్థానిక వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని గోపిరెడ్డి ఇబ్బంది పెట్టారన్న వార్తలు వచ్చాయి.

Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ మాస్ వార్నింగ్, మూడో కన్నుతెరిచానంటే జాగ్రత్త, సినిమాల విషయానికి రావొద్దని హెచ్చరిక
Balakrishna (Photo-Video Grab)

సినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య సినిమా పాటను ఒక వేడుకలో వేశారనే కారణంతో స్థానిక వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని గోపిరెడ్డి ఇబ్బంది పెట్టారన్న వార్తలు వచ్చాయి. దాంతో, భాస్కర్ రెడ్డి.. ఎమ్మెల్యే ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేశారు.

కళ్లజోడు చూసుకోవా అంటూ అభిమాని మీద ఫైర్ అయిన బాలకృష్ణ, ఊహించని పరిణామంతో చిన్నబుచ్చుకున్న అభిమాని, వీడియో వైరల్

ఈ విషయం తెలిసిన నందమూరి బాలకృష్ణ.. ఆ ఎమ్మెల్యే పేరు చెప్పకుండానే ఆయనపై ఆగ్రహించారు. సినిమాను సినిమాగానే చూడాలన్నారు. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే ఊరుకోనని ఓ కార్యక్రమంలో చెప్పారు.మొన్న నరసరావు పేటలో చిన్న సంఘటన జరిగింది. బాలకృష్ణ పాట వేశారంటూ వాళ్ల కార్యకర్తనే ఇబ్బంది పెట్టారు. అంతకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారా. యథా రాజ తథా ప్రజా. స్థాయి దిగజార్చుకున్న ఆ వ్యక్తి పేరు నేను తీయను.

ఎన్టీఆర్ కొడుకులు పరమశుంఠలు, ఎన్టీఆర్ చివరి కోరికను తీర్చలేని దద్దమ్మలు, బాలకృష్ణపై ఏపీ మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం, మూడు రోజుల తర్వాత నిద్రలేచాడంటూ బాలకృష్ణపై ఘాటువ్యాఖ్యలు

ఇంకోసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఊరుకోను. నేను చిటికేస్తే, మూడో కన్నుతెరిచానంటే చూస్కోండి జాగ్రత్త. రాజకీయ నాయకుడిగా నాపైకి వస్తానంటే రండి. నేను రెడీ. కానీ, సినిమాల విషయానికి రావొద్దు. మీ పరిధిలో మీరు ఉండండి’ అని బాలకృష్ణ హెచ్చరించారు.

(The above story first appeared on LatestLY on Mar 15, 2023 02:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).