NBK On Akkineni: అక్కినేని తొక్కినేని వ్యాఖ్యల వివాదంపై బాలకృష్ణ క్లారిటీ, అనుకోకుండా ఫ్లోలో ఆ మాట వచ్చేసింది, నాగేశ్వరరావు నాకు బాబాయి లాంటి వారు..

అక్కినేని నాగేశ్వరరావుపై తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ స్పందించారు. నాగేశ్వరరావుపై తాను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని, అనుకోకుండా తొక్కినేని అనే పదాన్ని మాట్లాడానని బాలకృష్ణ స్పష్టం చేశారు.

NBK On Akkineni: అక్కినేని తొక్కినేని వ్యాఖ్యల వివాదంపై బాలకృష్ణ క్లారిటీ, అనుకోకుండా ఫ్లోలో ఆ మాట వచ్చేసింది, నాగేశ్వరరావు నాకు బాబాయి లాంటి వారు..
Balakrishna Visit Kanaka Durga Temple (Photo-Video Grab)

అక్కినేని నాగేశ్వరరావుపై తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ స్పందించారు. నాగేశ్వరరావుపై తాను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని, అనుకోకుండా తొక్కినేని అనే పదాన్ని మాట్లాడానని బాలకృష్ణ స్పష్టం చేశారు.

హిందూపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావులు పరిశ్రమకు రెండు కళ్లలాంటి వారని, తన తండ్రి నేర్పిన క్రమశిక్షణను తాను నేర్చుకున్నానని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ మరణానంతరం అక్కినేని నాగేశ్వరరావుకు తొలి జాతీయ అవార్డును ఎన్టీఆర్ పేరిట అందించారని ఎన్‌బికె అంటారు.

నాగేశ్వరరావుపై తనకు అభిమానం ఉందని, ఆ వ్యాఖ్యలపై జరుగుతున్న ప్రచారంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్‌లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ టైమ్‌లో నటీనటుల మధ్య జరిగిన చర్చల గురించి చెబుతూ బాలకృష్ణ అక్కినేని నాగేశ్వర్ రావుపై అనుకోకుండా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

(The above story first appeared on LatestLY on Jan 26, 2023 05:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).